విడుదల తేదీ : మే 15, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : కైట్లిన్ శాంటా జువానా, టియో బ్రియోన్స్, రిచర్డ్ హార్మన్, ఓవెన్ పాట్రిక్ జాయ్నర్, ర్యా కిహ్ల్స్టెడ్, అన్నా లోర్, బ్రెక్ బాసింగర్, టోనీ టాడ్
దర్శకుడు : జాచ్ లిపోవ్స్కీ, ఆడమ్ స్టెయిన్
నిర్మాణం: క్రెయిగ్ పెర్రీ, షీలా హనాహన్ టేలర్, జాన్ వాట్స్, డయాన్ మెక్గునిగల్, టోబీ ఎమ్మెరిచ్
సంగీత దర్శకుడు : టిమ్ విన్
సినిమాటోగ్రఫీ : క్రిస్టియన్ సెబాల్డ్
ఎడిటర్ : క్రిస్టియన్ సెబాల్డ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
హాలీవుడ్ లో ఉన్నటువంటి పలు పాపులర్ ఫ్రాంచైజ్ లలో క్రేజీ హారర్ ఫ్రాంచైజ్ ఫైనల్ డెస్టినేషన్ కూడా ఒకటి. మరి ఈ ఫ్రాంచైజ్ నుంచి దాదాపు 14 ఏళ్ళు తర్వాత వచ్చిన కొత్త సినిమానే ఈ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. గ్లోబల్ రిలీజ్ కంటే ఒక రోజు ముందే మన దేశంలో విడుదల అయ్యిన ఈ చిత్రం ఎలా ఉందో అంచనాలు అందుకుందా లేదా అనేది సమీక్షలో చూద్దాం రండి.
కథ:
స్కై వ్యూ రెస్టారెంట్ టవర్ ఆరంభ సమయంలో జరిగే ఓ ఈవెంట్ కి సంబంధించి స్టెఫాని రేయెస్ (కైట్లిన్ శాంటా జువానా) తన అమ్మమ్మ ఐరిస్ క్యాంప్ బెల్, (గాబ్రియల్ రోజ్) అలాగే ఆమె ప్రేమికుడు దారుణంగా చనిపోయే పీడకల ఆమె తరచూ వెంటాడుతూ ఉంటాయి. వీటితో ఎంతగానో బాధ పడుతున్న స్టెఫాని సమాధానాల కోసం ఆమె అమ్మమ్మ ఇంటికి వస్తుంది. అక్కడ ఆమె చెప్పిన నిజం ఏంటి? తమ కుటుంబాన్ని వెంటాడుతున్న శాపం ఏంటి? ఆ శాపం నుంచి ఆ కుటుంబం బయట పడిందా లేదా? ఈసారి మరణం ఏ రీతిలో పలకరిస్తుంది అనేది తెలియాలి అంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
అసలు ఈ సిరీస్ ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం సినిమాలో పాత్రలు చావుతో సాగే ఒక ఎగ్జైటింగ్ జర్నీ అని చెప్పాలి. మరి సుమారు 14 ఏళ్ళు తర్వాత వచ్చిన ఈ సినిమా ఆ ఎగ్జైట్మెంట్ ని అలానే ఉంచింది అని చెప్పవచ్చు.
ఇంట్రెస్టింగ్ గా మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఈసారి ఇంకా కొత్త కొత్త డిజైన్ లతో రావడం ఈ ఫ్రాంచైజ్ లవర్స్ కి థియేటర్స్ లో పైసా వసూల్ ట్రీట్ ని అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. మెయిన్ గా కథా, దర్శకుని పనితీరు ఈ చిత్రం మెప్పిస్తాయి.
ప్రతీ మరణాన్ని ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసి ప్రెజెంట్ జెనరేషన్ కి కూడా ఒక కొత్త ట్రీట్ ని అందించారు. ఇంకా మరికొన్ని సీన్స్ అయితే ఓ రేంజ్ లో ఎగ్జైటింగ్ గా ఒకింత సర్ప్రైజింగ్ గా కూడా అనిపిస్తాయి. ఇక ఈ ఎలిమెంట్స్ తో పాటుగా కైట్లయిన్ శాంటా మంచి ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. అలాగే రిచర్డ్ హార్మోన్ కామెడీ టైమింగ్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో బాగుంది.
మైనస్ పాయింట్స్:
ఈ ఫ్రాంచైజ్ కోసం తెలిసినవారికి ఈ చిత్రంలో పెద్దగా కొత్తదనం కనిపించదు. రొటీన్ ప్లాట్ నే కొత్తగా తెరకెక్కించారు. సో ఈ విషయం వారికి మాత్రం రొటీన్ గానే అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ కొంచెం స్లో అయ్యినట్టు అనిపిస్తుంది. కొన్ని స్లో సీన్స్ తో మూమెంటం తప్పినట్టుగా అనిపిస్తుంది.
అలానే ఈ సినిమా వీక్ హార్ట్ ఆడియెన్స్ కి మాత్రం కాదు. వారు చిన్న పిల్లలు అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా దూరంగా ఉండాల్సిందే. సో వీరు ఆలోచించి ఈ సినిమాని ట్రై చేయాలి. అలాగే కీలక పాత్రల్లో డెప్త్ మిస్ అయ్యింది. ఇంకా కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్స్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయాల్సింది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. హాలీవుడ్ సినిమాల ప్రొడక్షన్ వాల్యూస్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాంకేతిక విభాగం అందరి పని తీరు బాగుంది. మెయిన్ గా క్రిస్టియన్ సెబాల్డ్ట్ వర్క్ స్టన్నింగ్ గా ఉంది. ఈ సినిమాకి కావాల్సిన విజువల్స్ ని తన పనితీరుతో ఎగ్జైటింగ్ లెవెల్లో ఆవిష్కరించారు. అలాగే గ్రాఫిక్స్ వర్క్ కూడా బాగుంది. టిమ్ విన్ మ్యూజిక్ బాగుంది.
ఇక దర్శకులు జాచ్ లిపోవ్స్కీ, ఆడమ్ స్టెయిన్ విషయానికి వస్తే అందరికీ తెలిసిన లైన్ నే కానీ వీరి ఆవిష్కరణ సినిమాలో ఈ ఫ్రాంచైజ్ లవర్స్ ని ఎంగేజ్ చేస్తుంది. సాలిడ్ మూమెంట్స్ తో సాగించిన తీరు ఈ సినిమాలో బాగుంది. సెకండాఫ్ లో కొంచెం స్లో అయ్యారు కానీ మిగతా సినిమా అంతా ఇంప్రెస్ చేస్తుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్’ చిత్రం ఈ ఫ్రాంచైజ్ లవర్స్ కి మాత్రం ఎగ్జైటింగ్ ట్రీట్ ఇస్తుంది అని చెప్పొచ్చు. వారికి కావాల్సిన ఎలిమెంట్స్ పుష్కలంగా ఈ సినిమాలో కనిపిస్తాయి. మంచి సస్పెన్స్ తో కూడా డెత్ సీన్స్ ట్రీట్ ఇస్తాయి. కాకపోతే ఇందులో కథ రొటీన్ గానే ఉంటుంది. సెకండాఫ్ లో అక్కడక్కడా స్లో అయ్యింది. అలాగే అన్ని వర్గాల ఆడియెన్స్ కి కూడా ఈ చిత్రం సూట్ కాదు. సో ఈ ఫ్రాంచైజ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి మంచి థ్రిల్స్ అందిస్తుంది. సో వీరు అలాగే ఈ తరహా సినిమాలు ఇష్టపడేవారికి ఈ చిత్రం థియేటర్స్ లో మంచి ట్రీట్ ఇస్తుంది.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team