అంజలి సమస్యని పరిష్కరిస్తామన్న చిత్ర సీమ – సురేష్ కొండేటి

అంజలి సమస్యని పరిష్కరిస్తామన్న చిత్ర సీమ – సురేష్ కొండేటి

Published on Apr 10, 2013 3:00 PM IST

Crazy--(3)
ఆర్య, హన్సిక, అంజలి, సంతానం, ప్రేంజీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘సెట్టై’ సినిమాని తెలుగులో ‘క్రేజీ’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఉగాది కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విశేషాలను తెలియజేయడానికి తెలుగు వెర్షన్ నిర్మాత సురేష్ కొండేటి ఈ రోజు ఉదయం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ ‘ థమన్ అందించిన మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియో లాగానే సినిమా కూడా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఈ సమ్మర్లో ఫుల్ గా ఎంజాయ్ చెయ్యదగిన లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ‘క్రేజీ’. ఇది కాకుండా గత నాలుగు రోజులుగా హీరోయిన్ అంజలి విషయం హాట్ టాపిక్. షాపింగ్ మాల్ సినిమా నుంచి ఆ అమ్మాయి నాకు తెలుసు. ఆడియో ఫంక్షన్ కి పిలుద్దామని వెళ్ళినప్పుడు షూటింగ్లో బిజీగా ఉంది అందుకే రాలేకపోయింది. రిలీజ్ టైంలో ఆ అమ్మాయిని తీసుకొద్దాం అంటే ఇలా జరిగింది. కానీ ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా బయటకి రావాలని, వచ్చి ఆగిపోయిన సినిమా షూటింగ్స్ లో పాల్గొనాలి. ప్రొడ్యూసర్స్ కి చాలా నష్టం జరుగుతోంది. మీకు ఏ సమస్య ఉన్నా ఫిల్మ్ చాంబర్ పరిష్కరిస్తుందని, అలాగే ఏ సమస్యా రాకుండా చూసుకుంటుందని ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు గారు మాటిచ్చారని’ అన్నాడు.

తాజా వార్తలు