రేస్ గుర్రం కోసం ఫైట్స్ చేస్తున్న బన్ని

రేస్ గుర్రం కోసం ఫైట్స్ చేస్తున్న బన్ని

Published on Sep 17, 2013 8:10 AM IST

Allu-Arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రేస్ గుర్రం’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అందులోనూ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను తీస్తున్నారు ఈ షూటింగ్ లో సినిమాలోని ప్రముఖ నటీనటులు పాల్గొంటున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సలోని సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని నిర్మాతలు 2014 జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి నల్లమలపు బుజ్జి నిర్మాత. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రేస్ గుర్రం హై ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫుల్ యాక్షన్ కలగలిపిన సినిమాగా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు.

తాజా వార్తలు