పెద్ద సినిమాలు అప్పటివరకు ఆగాల్సిందే-ఎఫ్ డి సి సి చైర్మన్

పెద్ద సినిమాలు అప్పటివరకు ఆగాల్సిందే-ఎఫ్ డి సి సి చైర్మన్

Published on May 2, 2020 2:59 AM IST

కరోనా ప్రభావం తో ఇండస్ట్రీ విపత్కర పరిస్థితుల్లో ఉంది. 24 క్రాప్ట్స్ నుండి థియేటర్స వరకూ నెలకొన్న స్తబ్దత అందరినీ ఆలోచనల్లో పడవేస్తున్నాయి. ఇండస్ట్రీ లో ఎప్పుడు మళ్ళీ షూటింగ్స్ మొదలవుతాయి.. ఈ సంవత్సరం పరిశ్రమ మనుగడ ఎలా ఉండబోతుంది అనే విషయాలపై తెలంగాణా ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత పి. రామ్మోహన్ మాట్లాడుతూ…

అన్ని పరిశ్రమలలో ఉన్న పరిస్థితే పిల్మ్ ఇండస్ట్రీ లో కూడా ఉంది.. అంతకంటే ప్రత్యేకంగా చెప్పాలంటే సినిమా పరిశ్రమ మళ్ళీ మామూలు పరిస్థితి కి రావడానికి ఎక్కువ టైం పట్టొచ్చు.. సమ్మర్ సీజన్ నే కాదు.. ఈ సంవత్సరం కూడా మిస్ అయినట్లే అనుకోవాలి. జనవరి వరకూ ఈ పరిస్థితి కోనసాగుతుంది అని నా అంచనా. సినిమా అంటే ప్రేక్షకులు వందల సంఖ్యలో వస్తారు.. అంతమంది ఒకసారి వచ్చినా ఎటువంటి భయాలు ఉండని పరిస్థితి వచ్చే వరకూ సినిమా థియేటర్స్ పరిస్థితి మెరగవదు.. మాల్స్, ఫంక్షన్ హాల్స్ , రెస్టారెంట్స్ మాదిరిగానే థియేటర్స్ రికవరీ కూడా ఎక్కువ టైం పడుతుంది. అందరూ దానికి ప్రిపేర్ అవ్వాలి, అన్నారు.

పెద్ద సినిమాలు, అంటే థియేటర్స్ దగ్గర రెవిన్యూ ని రాబట్టగలిగే సత్తా ఉన్న సినిమాలు తప్పకుండా ఆగాల్సిందే.. థియేటర్స్ కు ప్రేక్షకులు నిర్భయంగా వచ్చే టైం వరకూ సినిమాలను వాయిదా వేసుకోవాల్సిందే. నిర్మాతలు కూడా సినిమాలను ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేసేందుకు ఇష్టపడరు. నేను నిర్మాతగా వ్యవహారిస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ’ నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈమూవీని సమ్మర్ రిలీజ్ అనుకున్నాం.. ఇంకా 15 రోజులు షూటింగ్ ఉంది.. ఈ సినిమా రిలీజ్ డేట్స్ తారుమారు అయ్యాయి. థియేటర్స్ దగ్గర సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ ఆగాల్సిందే. తప్పదు అని తెలియజేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు