స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘మాస్టర్’ అనే టైటిల్ నిర్ణయించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుండి కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే విడుదలైంది. టీజర్ డేట్ కూడా ఇంకా బయటకు రాలేదు. ఇంతలోపే సినిమా థియేట్రికల్ బిజినెస్ దాదాపు పూర్తైంది. అది కూడా భారీ మొత్తంలో కావడం విశేషం.
తమిళనాడు వ్యాప్తంగా రూ.78 కోట్ల బిజినెస్ జరగ్గా తెలుగు రాష్ట్రాల్లో రూ.9.5 కోట్లు, కర్ణాటకలో రూ.8.5 కోట్లు, కేరళలో రూ.7.5 కోట్లు, ఓవర్సీస్లో రూ.33.5 కోట్ల బిజినెస్ జరిగింది. విజయ్ గత సినిమాలన్నీ భారీ విజయాలుగా నిలవడం, విజయ్ స్టార్ పవర్ వలనే ఈ సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.