చిరు కోసం ఫ్యాన్స్ మెగా గిఫ్ట్..!

చిరు కోసం ఫ్యాన్స్ మెగా గిఫ్ట్..!

Published on Aug 2, 2020 7:59 PM IST

ఈ ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి తన 65వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. కాగా దాదాపు 50రోజులు ముందుగానే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి మొదలైంది. చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇక చిరంజీవి పుట్టినరోజుకు గాను చరణ్ ఫ్యాన్స్ ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయబోతుండటం మరో విశేషం.చిరంజీవి పుట్టినరోజుకి ముందుగానే రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేయబోతోంది. మెగాస్టార్స్ మెగా ర్యాప్ పేరుతో విడుదల కానున్న ఈ పాటను వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ని శనివారం సాయంత్రం ఏడు గంటలకు విడుదల చేశారు. ఇక పాటను ఆగస్టు 21 న రిలీజ్ చేయనున్నారు. ఈ పాటకు ఫ్రీక్ మాసన్ సంగీతం అందించారు. సురేంద్ర ర్యాప్ ఆలపించారు.

ఇక ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు కొరటాల శివతో ఆచార్య అనే మూవీ చేస్తున్నారు. మరి ఈ మూవీ నుండి ఏదైనా కీలక అప్డేట్ కూడా ఆరోజు వచ్చే సూచనలు కలవు. ఈ మూవీ టైటిల్ ఆచార్య అని ప్రచారం అవుతున్నా, అధికారికంగా ప్రకటించలేదు. దీనితో చిరంజీవి బర్త్ డే నాడు ఆచార్య మూవీ టైటిల్ పోస్టర్ అండ్ ఫస్ట్ లుక్ విడుదల అయ్యే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు