పవన్ కళ్యాణ్ సినిమాలోకి కమ్ బ్యాక్ ఇస్తూ వరుసగా మూడు సినిమాలు ప్రకటించారు. వీటిలో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుంటున్న వకీల్ సాబ్ మూవీ చిత్రీకరణ చివరిదశకు చేరుకోగా.. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న మూవీ షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉంది. ఇక గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని సమాచారం. ఈ మూడు చిత్రాలలో క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి.
క్రిష్ పీరియాడిక్ మూవీగా తెరకెక్కిస్తుండగా పవన్ బందిపోటుగా కనిపిస్తారట. కాగా ఈ మూవీలో పవన్ కళ్యాణ్ లుక్ ఇటీవల లీకైన నేపథ్యంలో ఫ్యాన్స్ అంత సంతృపిగా లేరని తెలుస్తుంది. బందిపోటుగా పవన్ లుక్ ఓ రేంజ్ లో ఊహించుకున్న ఫ్యాన్స్ కి లీకైన లుక్ వారికి అంత కిక్ పంచలేదట. ఈ లుక్ పై క్రిష్ పునరాలోచించాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక ఆయనికి విజ్ఞప్తులు పంచుతున్నారు.ఐనా అధికారక లుక్ చూడకుండా ఈ అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదు కదా. మరి క్రిష్ వారి అభ్యర్థనలను స్వీకరిస్తాడో లేదో చూడాలి.