గ్యాప్ తీసుకున్నా గట్టిగానే కొట్టిన బన్నీ

గ్యాప్ తీసుకున్నా గట్టిగానే కొట్టిన బన్నీ

Published on Jan 13, 2020 6:43 PM IST

‘నాపేరు సూర్య నాఇల్లు ఇండియా’ చిత్రం పరాజయంతో గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. సినిమా విడుదలైన అన్ని చోట్లా బ్రహ్మండమైన వసూళ్లను రాబడుతోంది. గుంటూరులో తొలిరొజు రూ.3.41 కోట్ల షేర్ అందుకున్న ఈ చిత్రం ఉత్తరాంధ్రలో రూ.2.8 కోట్లు, కృష్ణాలో రూ.2.57 కోట్లు, నైజాం ఏరియాలో రూ.6 కోట్లు రాబట్టింది.

ఇక మిగిలిన ఏరియాల్లో కూడా ఇదే తరహాలో వసూళ్లు నమోదయ్యాయి. బన్నీ కెరీర్లో ఇవే ఉత్తమమైన వసూళ్లు. త్రివిక్రమ్, బన్నీల కలయికలో వచ్చిన ఈ మూడో చిత్రం హ్యాట్రిక్ విజయంగా నమోదైంది. సినిమా చూసిన ఫ్యాన్స్ సైతం గ్యాప్ తీసుకున్నా కూడా అల్లు అర్జున్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడని అంటున్నారు. మొత్తం మీద చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా డిక్లేర్ అయింది.

తాజా వార్తలు