దీపికా కామెంట్స్ పై ఫ్యాన్స్ సీరియస్ !

దీపికా కామెంట్స్ పై ఫ్యాన్స్ సీరియస్ !

Published on Nov 16, 2025 7:00 AM IST

deepika-padukone

కల్కి-2, స్పిరిట్ సినిమాల నుంచి హీరోయిన్ దీపికా పదుకొణె తప్పుకుంది. పని గంటల విషయంలో అభిప్రాయబేధాలొచ్చి ఆమె తప్పుకుంది. అదే విషయాన్ని దీపిక కూడా పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘నా కెరీర్‌ లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. నా కుటుంబం, అభిమానుల సహకారం, ప్రేమాభిమానాలే నాకు విమర్శలను ఎదుర్కోగల శక్తినిచ్చాయి’ అని దీపికా పదుకొణె తెలిపింది. తాజాగా మరోసారి దీపికా పనిగంటల అంశంపై మాట్లాడింది.

దీపికా మాట్లాడుతూ.. ‘అధికంగా పనిచేయడాన్ని మనమంతా కామన్ గా మార్చేశాం, అధికంగా శ్రమించడమే నిబద్ధత అనుకుంటున్నాం. ఓ మనిషి 8 గంటలకు మించి పని చేయకూడదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మంచి ఔట్ పుట్ ఇవ్వగలం, అధికంగా పనిచేయడం వల్ల అనారోగ్యం పాలై ఎన్ని గంటలు అధికంగా పనిచేసినా ఉపయోగం ఉండదు. దీంతో, ప్రభాస్ అభిమానులు ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఐతే ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో దీపికా సినిమా చేస్తోంది. ఆ సినిమా కోసం రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నావా ? అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు