మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ‘రచ్చ’ చిత్ర ఆడియో మార్చి 4న కర్నూల్ లో జరపనున్నట్లు మేము కొద్ది రోజుల కింద తెలియజేశాము. అలాగే ఈ ఆడియో వేడుకలో కొన్ని ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. ‘అదుర్స్’ అనే రియాలిటీ షోలో ప్రదర్శన ఇచ్చే ప్రముఖ బీర్ కల్స గ్రూప్ వారు అధ్బుత ప్రదర్శన ఇవ్వనున్నారు. వీరు అన్ని సాహసోపేతమైన ప్రదర్శనలు ఇస్తూ ప్రేక్షకులను అబ్బురపరిచారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరొయిన్ గా నటిస్తుంది. సంపత్ నంది దర్శకత్వం వహించిన రచ్చ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
బీర్ కల్స గ్రూప్ వారి ప్రదర్శన కోసం క్రింద వీడియో ను 3:05 నిమిషాల నుండి చూడండి.