‘ఆర్య’ సినిమా నుంచి తన నటనతో, ఎనర్జీ పెర్ఫార్మన్స్ తో అల్లు అర్జున్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన మొదటి సినిమా ‘గంగోత్రి’ తో అతన్ని హై రేజ్ లో లాంచ్ చేసారు అలాగే రెండవ సినిమాతో పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘బన్ని’, ‘దేశముదురు’, ‘పరుగు’,’ఆర్య 2′, ‘వేదం’ లాంటి సినిమాలతో అన్ని రకాల జోనర్స్ ని టచ్ చేస్తూ స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మీ నాన్నగారైన అల్లు అరవింద్ పేరు, మీ మామయ్య మెగాస్టార్ చిరంజీవి గారి పేరు నటుడిగా మీకు ఎంతవరకూ ఉపయోగపడింది అని అడిగితే బన్ని సమాధానమిస్తూ ‘ ఫ్యామిలీ పేరనేది ఒక బ్రాండ్. అదే ఆడియన్స్ ని థియేటర్ కి రప్పిస్తుంది. కానీ ఒక్క సారి లైట్స్ ఆగిపోయిన తర్వాత ప్రతి ఒక్కటీ మన పెర్ఫార్మన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. నా బదులు చిరంజీవి గారు వచ్చి డాన్సు వెయ్యరు, అల్లు అరవింద్ గారొచ్చి నా బదులు నటించరు కావున ఆడియన్స్ ని పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకునే భాద్యత నాదే’ అని అన్నాడు. అలాగే మాట్లాడుతూ ‘ నాకు రామ్ చరణ్ కి అలాగే మెగా ఫ్యామిలీలోని వారికి మధ్య ఎలాంటి పోటీ లేదు. అందరం ఒకే ఇండస్ట్రీలో ఉన్నాం ఎవరికి వారు తమకు తగిన సినిమాలు చేసుకుంటూ, కష్టపడుతూ ముందుకెలుతున్నామని’ అన్నాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్ వంశీ పైడిపల్లి షూట్ చేస్తున్న ‘ఎవడు’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. అలాగే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా మే 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.