సీతమ్మ .. కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యామిలీ ఆడియెన్స్

సీతమ్మ .. కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యామిలీ ఆడియెన్స్

Published on Mar 19, 2012 11:19 AM IST


తెలుగులో చాలా కాలం తరువాత వస్తున్న అతి పెద్ద మల్టి స్టారర్ సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కోసం ఫ్యామిలీ ప్రేక్షకులు ఆత్రుతగా వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ మరియు పిన్స్ మహేష్ బాబు వంటి ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో ‘కొత్త బంగారు లోకం’వంటి సినిమా తీసి ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరైన శ్రీకాంత్ అడ్డాల మరియు ‘భద్ర’, ‘బొమ్మరిల్లు’, ‘పరుగు’, ‘కొత్త బంగారు లోకం’, బృందావనం’ మరియు మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ పల్స్ తెలిసిన దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రం పై ఆసక్తి చూపిస్తున్నారు. వెంకటేష్ మరియు మహేష్ బాబు ఇద్దరు సోదరులుగా నటిస్తుండగా వారి తండ్రిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. మహేష్ బాబుకి జోడీగా సమంతా మరోసారి నటిస్తుంది.

తాజా వార్తలు