అదిరిపోయే ఫైట్ లతో బాలకృష్ణ ‘లెజెండ్’

Legend_First_Look(1)
బాలకృష్ణ తాజా చిత్రం ‘లెజెండ్’ షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఈ చిత్రానికి సంభందించిన ఎన్నో విషయాలు రోజు రోజుకి ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర , గోపీచంద్, రామ్ ఆచంట మరియు సాయి కొర్రపాటి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మరియు వారాహి బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ఒక పవర్ ఫుల్ ఏక్షన్ డ్రామా కావడం వల్ల బాలకృష్ణ ఇమేజ్ ని దృష్టి లో పెట్టుకుని ఫైట్ ల పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ చిత్రం లో చాలా భాగం వైజాగ్, హైదరాబాద్ లలో చిత్రీకరించారు. ఇటివలే దుబాయ్ లోని ఒక ఎడారి లో చిత్రీకరించిన ఒక పెద్ద ఏక్షన్ సన్నివేశం చాలా బాగా వచ్చిందంట. రాధిక ఆప్టే మరియు సోనాల్ చౌహన్ హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రం లో జగపతి బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో మార్చ్ 9 న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ చిత్రం మార్చ్ చివరి వారం లో కాని ఏప్రిల్ మొదటివారంలో కాని విడుదల కానుంది.

Exit mobile version