మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ లో తన మొదటి సినిమాతో ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయాడు. కానీ ఈ యంగ్ హీరో ఇప్పుడు బాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో ఓ సెన్సేషనల్ సినిమా చేయనున్నాడు. ఇంతకీ ఎవరా ఆ డైరెక్టర్ అనుకుంటున్నారా? గతంలో ‘లగాన్’, ‘జోధా అక్బర్’ సినిమాలు తీసిన అశుతోష్ గోవారికర్ డైరెక్షన్ లో చరణ్ ఓ సినిమా చేయనున్నాడు.
ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కే పీరియడ్ డ్రామాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం కొంత టైం తీసుకొంటుందని అంటున్నారు. ఈ సినిమా 2014 చివర్లో గానీ లేదా 2015 మొదట్లో గానీ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకి సంబందించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
అశుతోష్ గోవారికర్ ‘మగధీర’ సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ చూసి బాగా ఇంప్రెస్ అయ్యారని, దాని ద్వారానే వీరిద్దరి కాంబినేషన్లో సినిమాకి పునాది పడిందని సమాచారం. ఈ వార్త రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఆసక్తి మరియు సంతోషాన్ని ఇస్తుంది. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాము.