ప్రత్యేకం : గబ్బర్ సింగ్ ఆడియోతో కొత్త ట్రెండ్ సృష్టించనున్న పవన్ కళ్యాణ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గబ్బర్ సింగ్’ షూటింగ్ పూర్తి చేసుకుంటూ ఏప్రిల్ మొదట వారంలో ఆడియో విడుదలకు సిద్ధమవుతుండగా, ఈ ఆడియో వేడుకతో కొత్త నూతన ఒరవడి తీసుకురానున్నారు. ఇప్పటి వరకు ఆడియో వేడుకను టీవీలో లేదా ఇంటర్నెట్లో మాత్రమే ప్రత్యక్షంగా చూసాము. గబ్బ ర సింగ్ ఆడియో వేడుక మాత్రం మొబైల్ ఫోన్లో చూడబోతున్నాము. అవును మీరు విన్నది నిజమే. గబ్బర్ సింగ్ ఆడియో వేడుక ప్రత్యక్షంగా మొబైల్ ఫోన్లో చూడబోతున్నాము. దీని కోసం ప్రత్యేకంగా ఒక అప్లికేషన్ రూపొందిస్తున్నారు. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో ప్రత్యక్షంగా గబ్బర్ సింగ్ ఆడియో వేడుక చూడొచ్చు. ప్రస్తుతం నిర్వాహకులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్ సరసన శృతి హసన్ నటిస్తుండగా బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version