ఆసక్తికరమైన మల్టీ స్టారర్ సినిమా రెడీ అవుతోందా?

ఆసక్తికరమైన మల్టీ స్టారర్ సినిమా రెడీ అవుతోందా?

Published on Aug 8, 2013 8:56 AM IST

krishna-venky-and-ram-chara
ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ ఆసక్తికరమైన మల్టీ స్టారర్ సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమాలో మూడు ఫ్యామిలీ లకు చెందిన ముగ్గురు ఫేమస్ హీరోలు నటించనున్నారు. ఆ ముగ్గురు సూపర్ స్టార్ కృష్ణ, విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని అనుకుంటున్నారు.

ఈ సినిమాకి తగిన కథని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ఇప్పటికే రెడీ చేసారని, ఆయనే దర్శకత్వ భాద్యతలు కూడా వహించనున్నాడు. ఫేమస్ నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. ఈ విషయం గురించి మేము అడిగినప్పుడు ఈ సినిమా గురించిన చర్చలు ఇంకా మొదటి దశలోనే ఉన్నాయని తెలిసింది.

ఈ విషయంపై అధికారిక ప్రకటన రావడానికి మరికొంత సమయం పట్టొచ్చు. కానీ కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళాలని భావిస్తున్నాం. ప్రేక్షకులకు ఎన్థొఆసక్థిని కలిగించే సినిమా ఇది. ఈ సినిమాకి సంబందించిన విశేషాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను.

తాజా వార్తలు