లారెన్స్ లక్ష్మీ బాంబ్ చుట్టేశాడట

కొరియాగ్రాఫర్ కమ్ హీరో అండ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ లక్ష్మీ బాంబ్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న లక్ష్మీ బాంబ్ చిత్రానికి లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మరియు వి ఎఫ్ ఎక్స్ వర్క్ కూడా పూర్తి అయిందట. కేవలం డబ్బింగ్, బీజీఎమ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తుంది. లాక్ డౌన్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి బ్రేక్ పడింది. ఇక సాధారణ పరిస్థితులు ఏర్పడి థియేటర్స్ ఓపెన్ అయిన వెంటనే ఈ మూవీ విడుదల ఉంటుంది.

లక్ష్మీ బాంబ్ 2011లో లారెన్స్ హీరోగా వచ్చిన కాంచన చిత్రానికి హిందీ రీమేక్. ఈ మూవీలో అక్షయ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. మొదట్లో ఈ ప్రాజెక్ట్ నుండి రాఘవ లారెన్స్ తప్పుకోవాలని అనుకున్నారు. తన ప్రమేయం లేకుండా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం ఆయనను బాధపెట్టింది. ఐతే హీరో అక్షయ్ కుమార్ బ్రతిమిలాడి లారెన్స్ ని ఈ సినిమా కోసం తెచ్చుకున్నారు.

Exit mobile version