అందరి చూపు ప్రభాస్ షూటింగ్ వైపే.. ఎందుకో తెలుసా

అందరి చూపు ప్రభాస్ షూటింగ్ వైపే.. ఎందుకో తెలుసా

Published on Oct 2, 2020 9:57 PM IST


లాక్ డౌన్ విధించడంతో స్వదేశంలోనే కాదు విదేశాల్లో షూటింగ్ జరుపుకోవాల్సిన చాలా తెలుగు సినిమాలు ఆగిపోయాయి. ఫారిన్ షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని ఇక ఇవాళో రేపో బయలుదేరాలి అనుకున్న చాలా యూనిట్లు లాక్ డౌన్ కారణంగా ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఆగిపోయాయి. స్థానికంగా షూటింగ్ ముగించుకుని అచ్ఛంగా ఫారిన్ లొకేషన్లలోనే చిత్రీకరణ జరుపుకోవాల్సిన చిత్రాలు చాలానే ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్లకు అనుమతులిచ్చినా బయటి దేశాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలీక చాలామంది నిర్మాతలు దేశం దాటడానికి ఆలోచిస్తున్నారు. అక్కడ షూటింగ్ సజావుగా సాగుతుందా, ఏవైనా నిబంధనలు ఉన్నాయా, ఒకవేళ అక్కడికి వెళ్ళాక ఏవైనా సమస్యలు వస్తే ఏం చేయాలి లాంటి అనేక సందేహాలు వారిని వెంటాడుతున్నాయి. అలాంటి వారంతా ఇప్పుడు ప్రభాస్ యొక్క ‘రాధే శ్యామ్’ చిత్రీకరణను జాగ్రత్తగా గమనిస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ అండ్ టీమ్ షూటింగ్ రీస్టార్ట్ చేయడం కోసం యూరప్ వెళ్లారు. అక్కడ వారు చిత్రీకరణను విజయవంతంగా పూర్తిచేసుకుంటే ఫారిన్ షూటింగ్లకు ముఖ్యంగా యూరప్లో షూటింగ్లకు ఎలాంటి ఇబ్బందులు లేనట్టే లెక్క. అప్పుడు ఇతర చిత్రాల నిర్మాతలు సైతం ఫారిన్ లొకేషన్లలో చిత్రీకరణలకు సిద్దమవచ్చు. అందుకే ప్రభాస్ చిత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా షూటింగ్ ,ముగించుకోవాలని సినీ జనం కోరుకుంటున్నారు.

తాజా వార్తలు