మహేష్ బాబు సినిమాని ఫాన్సీ రేట్ కి కొనుక్కున్న ఈరోస్

మహేష్ బాబు సినిమాని ఫాన్సీ రేట్ కి కొనుక్కున్న ఈరోస్

Published on Dec 2, 2013 5:07 PM IST

One-Nenokkadine
బాలీవుడ్ లో బాగా ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ అయిన ఈరోస్ ఇంటర్నేషనల్ వారు ఎవరూ ఊహించని విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘1-నేనొక్కడినే’ సినిమాకి సంబందించిన ఫుల్ రైట్స్ ని ఓ భారీ మొత్తానికి కొనుక్కున్నారు. ఈ డీల్ వల్ల ‘1 – నేనొక్కడినే’ సినిమాకి సంబందించిన(ఓవర్సీస్ రైట్స్, శాటిలైట్ మొదలైన) అన్ని రైట్స్ ఈరోస్ కే చెందుతాయి.

ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న దాని ప్రకారం ఓ భారీ మొత్తానికే ఈ డీల్ కుదిరిందని అంటున్నారు. ఈ విషయంపై త్వరలోనే ఈ చిత్ర మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆశించవచ్చు. మహేష్ బాబు – కృతి సనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోని డిసెంబర్ 19న రిలీజ్ చేయనున్నారు. అలాగే సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ప్రేక్షకులకు అందించడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు