మెగా డాటర్ నిహారిక పెళ్ళికి సిద్దమైన సంగతి తెలిసిందే. ఆమె గుంటూరు కి చెందిన జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకోనున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు ఈ పెళ్లిని నిశ్చయించారు. జొన్నలగడ్డ చైతన్య గుంటూరు ఐజి ప్రభాకరరావు కుమారుడు. ఇక వీరిద్దరి కుటుంబాల మధ్య ఎప్పటి నుండో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. కొద్దిరోజులుగా నిహారిక తనకు కాబోయేవాడితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ సందడి చేస్తుంది.
కాగా నిహారిక- చైతన్య నిశ్చితార్ధ వేడుకకు ముహూర్తం పెట్టారు. ఆగస్టు 13న హైదరాబాద్ లో వీరి నిశ్చితార్ధ వేడుక జరగనుంది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు హాజరుకానున్నారు. ఇక నిహారిక ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి సినిమాలలో నటించింది. నిర్మాతగా కూడా నిహారిక వెబ్ సిరీస్ లు నిర్మించింది.