రీ రికార్డింగ్లో ఎందుకంటే ప్రేమంట

రీ రికార్డింగ్లో ఎందుకంటే ప్రేమంట

Published on May 12, 2012 11:01 PM IST


రామ్, తమన్నా జంటగా నటిస్తున్న ఎందుకంటే ప్రేమంట సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా ప్రస్తుతం జివి ప్రకాష్ కుమార్ అధ్వర్యంలో రీ రికార్డింగ్
పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్నీ రామ్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంటులో ధ్రువీకరించాడు. జివి ప్రకాష్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి స్పందన లభిస్తుంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ నెగటివ్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహించాడు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు