హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ఏమో గుర్రం ఎగురావచ్చు

హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ఏమో గుర్రం ఎగురావచ్చు

Published on Jul 17, 2013 8:50 PM IST

Emo-Gurram-Egaravacchu-Movi
సుమంత్, పింకీ సావికా జంటగా నటిస్తున్న ‘ఏమో గుర్రం ఎగురావచ్చు’ సినిమా షూటింగ్ శరవేగంగా పుర్తిచేసుకుంటుంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో హీరో హీరోయిన్ల నడుమ కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కించారు. దీంతో హైదరాబాద్ షెడ్యూల్ పుర్తవడమే కాక 90శాతం సినిమా షూటింగ్ పూర్తయింది. “ఇప్పటివరకూ నా కెరీర్లోనే అత్యంత ఛాలెంజింగ్ సీన్ల షూటింగ్ ముగిసింది. చాలా అలిసిపోయాను. ‘ఏమో గుర్రం ఎగురావచ్చు’ కోసం నా కష్టానికి తగ్గ ప్రతిఫలం గురించి ఎదురుచూస్తున్నా” అని ట్వీట్ చేసాడు. చంద్రసిద్ధార్ధ్ ఈ సినిమాకు దర్శకుడు. సుదీర్ కుమార్ నిర్మాత. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్ కాంచి స్క్రిప్ట్ ను అందించాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు