బ్యాంకాక్ లో ఏమో గుర్రం ఎగరావచ్చు ఆడియో విడుదల

emo_gurram_egara_vachu_audi

సుమంత్ హీరోగా నటించిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమా ఆడియో ఆసక్తికర రీతిలో విదుదలైంది. ఈ సినిమా పాటలను ప్రొడక్షన్ బృందం బ్యాంకాక్ లో 9 వివిధ ప్రదేశాలలో విడుదలచేసింది. ఒకటి షాపింగ్ మాల్ లో విడుదలచేస్తే మరొకటి సబ్మెరైన్ లో విడుదలచేశారు. ఈ సినిమా హీరోయిన్ అయిన పింకీ సావిక థాయ్ నటి కావడంతో థాయ్ టూరిజం సహాయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది.

ఈ సినిమాకు చంద్రసిద్ధార్ధ్ దర్శకుడు. ఎం.ఎం కీరవాణి సంగీత దర్శకుడు. ఎస్.ఎస్ కాంచి స్క్రిప్ట్ ను అందించాడు. పూదోట సుదీర్ కుమార్ నిర్మాత.

ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ సమపాళ్ళలో కూర్చిన సినిమాగా తెరకెక్కుతుంది.

Exit mobile version