రాజమౌళి ఈగకి దక్కనున్న మరిన్ని పురస్కారాలు

రాజమౌళి ఈగకి దక్కనున్న మరిన్ని పురస్కారాలు

Published on May 16, 2013 3:43 PM IST

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమా ‘ఈగ’. ఈ సినిమా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకుల మన్ననలు అందుకోవడమే కాకుండా జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ ‘ఈగ’ అంతటితో ఆగకుండా ఇటీవలే దేశాలు దాటి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించడానికి వెళ్ళింది. ఇదిలా ఉంటే మళ్ళీ ‘ఈగ’ యునైటెడ్ కింగ్ డం కి సంబందించిన ‘మాడ్రిడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ కి ఎంపికైంది. ఎంపికవ్వడమే కాకుండా బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ మ్యూజిక్ కంపోజర్, బెస్ట్ ఎడిటర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అనే 6 విభాగాల్లో నామినేట్ అయ్యింది.

ఇలా నామినేట్ అయ్యిందో లేదో అప్పుడే కొరియాలో బాగా పాపులర్ అయిన ‘పుచోన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో’ కూడా స్క్రీనింగ్ కోసం ఆహ్వానం వచ్చిందని రాజమౌళి తెలిపారు. ఒక తెలుగు సినిమాకి ఇంత ఖ్యాతి రావడం మనం ఎంతో గర్వించదగ్గ విషయం. ఇదంతా జరగటానికి గల ఏకైక కారకుడు ఎస్ ఎస్ రాజమౌళి.. హాట్సాఫ్ టు యు..

తాజా వార్తలు