‘ఈగ’ యుఎస్ ప్రింట్స్ స్టేటస్

‘ఈగ’ యుఎస్ ప్రింట్స్ స్టేటస్

Published on Jul 4, 2012 6:13 PM IST


గ్రాఫికల్ మానియా “ఈగ” జూలై 6న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రానికి సంభందించిన యుఎస్ ప్రింట్స్ ఈ రోజు రాత్రి బయలుదేరనున్నాయి. మొత్తం 17 తెలుగు సాధారణ ప్రింట్స్, 30 తెలుగు డిజిటల్ ప్రింట్స్, 3 తమిళ సాధారణ ప్రింట్స్, 10 తమిళ డిజిటల్ ప్రింట్స్ ఈ రోజు రాత్రి 9 గంటల 55 నిమిషాలకు బయలుదేరబోయే యుఎస్ ఫ్లైట్ లో వెళ్లనున్నాయి. ఈ ప్రింట్స్ గురువారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు(యుఎస్ టైం ప్రకారం) యుఎస్ చేరుకుంటాయి.

సినీ అభిమానులు ఈగ చిత్రం ప్రిమియర్ షో షెడ్యూల్స్ కోసం యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ని అడుగుతున్నారు. ఆ ప్రీమియర్ షోకి సంభందించిన వివరాలు మాకు తెలియాల్సి ఉంది మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం.

తాజా వార్తలు