రాజమౌళి రెండేళ్ళ కృషి ‘ఈగ’ అటు విమర్శకుల్ని, ఇటు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడంతో ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ఆస్కార్ నామినీలో చోటు దక్కించుకుంది. ఇండియా నుండి ఉత్తమ చిత్ర ఎంపిక కోసం వివిధ భాషల నుండి 12 సినిమాలను ఎంపిక చేయగా తెలుగు నుండి కేవలం ఈగ సినిమా ఒక్కటే ఎంపిక అయింది. ఈ నెల 18 నుండి 26 వరకు హైదరాబాదులో ఈ పన్నెండు చిత్రాలను జ్యూరీ సభ్యులు చూసి అందులో ఎంపికైన ఉత్తమ చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్ కి పంపిస్తారు. తమిళ్ నుండి రెండు, మలయాళం నుండి రెండు, హిందీ నుండి ఏడు సినిమాలు ఎంపిక కాగా తెలుగు నుండి కేవలం ఈగ సినిమా ఒక్కటే ఎంపిక అయింది.
- ఈగ (తెలుగు)
- వజకు ఎన్ 18/9 (తమిళ్)
- 7 ఎఎం అరివు (తమిళ్)
- డియోల్ (మరాఠి)
- ఆకశింతే (మలయాళం)
- కహాని (హిందీ)
- బర్ఫీ (హిందీ)
- హీరోయిన్ (హిందీ)
- ఫెర్రారీ కి సవారి (హిందీ)
- గాంగ్స్ అఫ్ వసేపూర్ (హిందీ)
- డర్టీ పిక్షర్ (హిందీ)
- పాన్ సింగ్ తోమార్ (హిందీ)