ఈగ మే చివర్లో వాలబోతుందా?


అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఈగ’ చిత్రం మే చివరి వారంలో వాలబోతుందా? అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు తాజా సమాచారం ప్రకారం ఈగ సినిమా మే చివర్లో విడుదల చేయబోతున్నారని చెబుతున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి అందిస్తున్న ఈగ ఆడియో ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతుండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నాని, సమంతా, సుదీప్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ఈగ కీలక పాత్ర పోషిస్తుంది. ఈగ చిత్రానికి గ్రాఫిక్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మీ అభిమాన చిత్రాల అప్డేట్స్ 123తెలుగు.కాం లో ప్రత్యేకంగా అందిస్తాం.

Exit mobile version