బాక్స్ ఆఫీస్ వద్ద తగ్గని ఈగ హవా


ఎస్ ఎస్ రాజమౌళి గ్రాఫికల్ మాయాజాలం “ఈగ” బాక్స్ ఆఫీస్ మీద తన ఆధిపత్యాన్ని పలు ప్రాంతాల్లో ఇంకా కొనసాగిస్తూనే ఉంది. మల్టీప్లెక్స్ మరియు ఓవర్సీస్ లలో ఈ చిత్రం తనదయిన ప్రతాపం చూపిస్తుంది. పిల్లలు మరియు కుటుంబాలు ఈ చిత్రాన్ని చాలా బాగా ఆదరించడం ఈ కలెక్షన్ల వెనక ఉన్న రహస్యం. సమంత మరియు నాని ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో నటించగా సుద్దీప్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. గతంలో ఎన్నడు చూడని విధంగా రాజమౌళి ఇందులో గ్రాఫిక్స్, విజువల్ ఎఫ్ఫెక్ట్స్ ఉపయోగించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించారు. డి సురేష్ బాబు ఈ చిత్రాన్ని సమర్పించారు.

Exit mobile version