‘గలాటా’ చెయ్యనున్న ఈరోజుల్లో హీరో

‘గలాటా’ చెయ్యనున్న ఈరోజుల్లో హీరో

Published on Oct 13, 2013 12:01 AM IST

Galata_Movie_stills (3)
‘ఈ రోజుల్లో’ సినిమాలో నటించి తోలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న నటుడు శ్రీ. కాకపోతే ఈ మధ్య అతను నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. ప్రస్తుతం శ్రీ ఒక కొత్త తరం యువత ప్రేమ కధ అయిన ‘గలాటా’ అనే సినిమాతో మనముందుకు రానున్నాడు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ముగించుకుని రెండో షెడ్యూల్ ను త్వరలోనే ప్రారంభించనుంది. ఈ సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉండబోతుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమాలో హరి ప్రియ హీరోయిన్. సునీల్ కశ్యప్ సంగీతంలో, రాజేంద్ర ప్రసాద్ వర్మ నిర్మాణంలో కృష్ణ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు

తాజా వార్తలు