ఫిబ్రవరి 9న “ఈ రోజుల్లో” చిత్ర ఆడియో విడుదల

ఫిబ్రవరి 9న “ఈ రోజుల్లో” చిత్ర ఆడియో విడుదల

Published on Feb 4, 2012 7:48 PM IST


నిజంగా జరిగిన కథ ఆధారంగా రూపొందిన చిత్రం “ఈ రోజుల్లో” ఈ చిత్రానికి గత కొన్ని రోజులుగా సోషల్ నెట్వర్కింగ్ సైట్ ల లో అద్బుతమయిన స్పందన కనిపించింది. ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. శ్రీనివాస్,రేష్మ లు ఈ చిత్రం తో తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి జె.బి సంగీతం అందిస్తున్నారు.ఈ నెల 9న రాక్ హైట్స్ లో ఈ చిత్ర ఆడియో విడుదల కానుంది. చిన్న చిత్రాలలో సంచలనం సృష్టిస్తుంది అని అంటున్నారు. ఈ చిత్రానికి ఎస్.కే.ఎన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తాజా వార్తలు