‘ఫౌజీ’ కోసం ప్రభాస్ మరోసారి ఆ లుక్‌లో..?

‘ఫౌజీ’ కోసం ప్రభాస్ మరోసారి ఆ లుక్‌లో..?

Published on Jun 29, 2025 2:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన ‘ది రాజాసాబ్’ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన చాలా స్టైలిష్ లుక్‌తో డార్లింగ్ వైబ్స్ తీసుకురానున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే, దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ ‘ఫౌజీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ చిత్రం సెట్స్ నుంచి ప్రభాస్ లుక్స్ కొన్ని నెట్టింట లీక్ అయ్యాయి. దీంతో ప్రభాస్ ఈ సినిమాలో ‘మిర్చి’ చిత్రం తరహా లుక్స్‌లో ఉన్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

నిజంగానే ప్రభాస్ గనక ఆ లుక్స్‌లో కనిపిస్తే అభిమానులకు పండగే అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో అందాల భామ ఇమాన్వి హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు