పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది చివర్లో ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ పంచారు. ఆయనను ఇక వెండితెరపై చూడలేమని నిరాశపడుతున్న ఫ్యాన్స్ కి రీఎంట్రీతో ఖుషీ చేశారు. ఎంట్రీ ఇవ్వడంతో పాటు వరుసగా మూడు చిత్రాలు ప్రకటించడం వారిని ఫుల్ ఖుషీ చేసింది. ఐతే వారి ఆనందానికి లాక్ డౌన్ అడ్డుకట్ట వేసింది. మే నెలలో రావలసిన పవన్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ వాయిదా పడింది. కాగా పవన్ ఫ్యాన్స్ కి మరో దిగులు మొదలైందని సమాచారం.
2024లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రెండేళ్ల ముందు నుండే వాటిపై దృష్టి సారించాల్సివుంది. సంస్థాగతంగా క్షేత్ర స్థాయిలో జనసేనను బలోపేతం చేయాలి అనేది పవన్ ఆలోచన. అందుకే 2022 కల్లా ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఐతే లాక్ డౌన్ కారణంగా ఆయన ఒప్పుకున్న సినిమాలు నిర్ణీత సమయంలో పూర్తి అయ్యేలా కనిపించడం లేదు. 2020 లో షూటింగ్స్ మొదలుకావడం సాధ్యం కాదని తెలుస్తుండగా క్రిష్ పీరియాడిక్ మూవీ మరియు హరీష్ శంకర్ మూవీ పూర్తి చేయడం కష్టమే. క్రిష్ మూవీ మొదలైంది కాబట్టి 2022 లోపు దానిని పూర్తి చేయవచ్చు. ఐతే హరీష్ శంకర్ మూవీకి మరో ఏడాది సమయం తీసుకోవాల్సి వస్తుంది. అంటే 2023కు కానీ ఆమూవీ పూర్తికాదు. ఈనేపథ్యంలో పవన్ హరీష్ మూవీ పక్కన పెడతాడనే వాదన వినిపిస్తుంది. పవన్ ఫ్యాన్స్ లో కూడా ఈ భయం మొదలైంది.