‘కె-ర్యాంప్’ ఆడించే ట్రైలర్ వచ్చేస్తోంది..!

‘కె-ర్యాంప్’ ఆడించే ట్రైలర్ వచ్చేస్తోంది..!

Published on Oct 9, 2025 5:54 PM IST

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కె-ర్యాంప్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. దర్శకుడు జేన్స్ నాని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. ఈ మేరకు ట్రైలర్ అప్డే్ట్‌ను అక్టోబర్ 10న ఉదయం 11.07 గంటలకు ఇవ్వబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ ట్రైలర్‌తో కిరణ్ అబ్బవరం ఎలాంటి ర్యాంప్ ఆడిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 18న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా రాజేష్ దండ, శివ బొమ్మక్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు