ప్రారంభమైన తమన్నా గంగ పాత్ర డబ్బింగ్

ప్రారంభమైన తమన్నా గంగ పాత్ర డబ్బింగ్

Published on Sep 14, 2012 10:07 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’. ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. తమన్నా పాత్రకు సంభందించిన డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం టాకీ పార్ట్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ చిత్రంలోని చివరి రెండు పాటల చిత్రీకరణ జరుగుతోంది. అక్టోబర్ 11న విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం యొక్క పోస్ట్ పొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. పవన్ రిపోర్టర్ గా నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 24న భారీగా జరగనుంది.

తాజా వార్తలు