సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సినిమాకు రీ రికార్డింగ్ ద్వారా ఎంత బలాన్ని ఇస్తాడో మనకు తెలిసినదే. గత చిత్రాలలో తన నేపధ్య సంగీతమే హై లైట్ గా నిలిచిన దశలు చాలా వున్నాయి. ఇప్పుడు దేవి లెజెండ్ కి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చెయ్యనున్నాడు
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల దశలో వున్న ఈ సినిమాలో దేవి అందించిన నేపధ్య సంగీతం ప్రధానాకర్షణగా నిలవనుంది
బాలకృష్ణ, రాధికా ఆప్టే మరియు సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రధారులు. లెజెండ్ సినిమా 28న విడుదలకానుంది. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ మరియు వారాహి చలనచిత్ర సంస్థలు నిర్మిస్తున్నాయి