2012 లో భారి చిత్రాలతో మళ్ళి తనను తాను నిరూపించుకునేందుకు దేవి శ్రీ ప్రసాద్ సకలం సిద్దం చేసుకున్నారు. ప్రస్తుతం గబ్బర్ సింగ్,ఎవడు,డమరుఖం,వారధి మరియు అల్లు అర్జున్-త్రివిక్రమ్ ల చిత్రాలు తమిళం లో సింఘం-2 మరియు అలెక్స్ పాండియన్ చిత్రాలకు పని చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఒక సల్మాన్ ఖాన్ చిత్రానికి పని చెయ్యటానికి దేవి శ్రీ ప్రసాద్ అనుకుంటున్నట్లు సమాచారం రెడీ చిత్రం లో దింకి చక సాంగ్ భారి హిట్ అయ్యాక కోన వెంకట్ సల్మాన్ నటిస్తున్న “నో ఎంట్రీ -2” చిత్రానికి గాను దేవి ని సూచించినట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా ఒకవేళ అయన ఒప్పుకుంటే దేవి శ్రీ ప్రసాద్ కి ఇదొక గొప్ప అవకాశం కానుంది.