ఇద్దరమ్మాయిలతోకి మొదలు కానున్న దేవీ శ్రీ ఆర్.ఆర్

Iddarammailatho

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా పోస్ట్ – ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ ముగిసింది. దేవీ శ్రీ ప్రసాద్ ఫస్ట్ హాఫ్ కి రీ – రికార్డింగ్ త్వరలో మొదలుపెట్టనున్నాడని సమాచారం. పూరి జగన్నాథ్ ఈ సినిమా చాలా వేగంగా, అలాగే చాలా జాగ్రత్తగా షూట్ చేస్తున్నారు. ఈ సినిమాని దాదాపు రెండు నెలలు బార్సిలోనాలో, కొద్ది రోజులు బ్యాంకాక్ లో, మిగిలిన బాగాన్ని హైదరాబాద్లో షూట్ చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, అమలా పాల్ , కేథరిన్ లు హీరోయిన్స్ గా యాక్షన్ , రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆరు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ ని 1మిలియన్ మంది చూశారు. ఈ సినిమాకి ఎస్.ఆర్.శేఖర్ ఎడిటర్ గా, అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాని మే 10న విడుదల చేయనున్నారు.

Exit mobile version