బాలయ్య కోసం ప్రత్యేకమైన ట్యూన్స్ రెడీ చేస్తున్న దేవీ శ్రీ ప్రసాద్

Devi-sri-prasad

అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ తన కెరీర్ లో ముందుకు వెళ్తున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. గత కొద్ది సంవత్సరాలుగా సూపర్ హిట్ సంగీతాన్ని అందిస్తున్న దేవీ శ్రీ ప్రసాద్ తన కెరీర్ లో మొదటి సరిగా నందమూరి బాలకృష్ణ సినిమాకి సంగీతాన్ని అందించనున్నాడు. కానీ అభిమానులు మాత్రం దేవీ సంగీతం స్టైల్ పై కాస్త ఆందోళన చెందుతున్నారు. దేవీ సంగీతం బాలకృష్ణ సినిమాలలో ఉండే మాస్ సంగీతానికి కాస్త డిఫరెంట్ గా వుంటుందని వారు భావిస్తున్నారు. ఏది ఏమైనా దేవీ శ్రీ ప్రసాద్ అందరికి నచ్చే విదంగా సంగీతాన్ని అందించి వారి వాదనలు తప్పు అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా కోసం తను ప్రత్యేకమైన ట్యూన్స్ రెడీ చేస్తున్నాడని తెలిసింది. అలాగే ఈ సినిమా టైటిల్ ట్రాక్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నడని సమాచారం.

బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సాయి కొర్రపాటి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ‘లెజెండ్’. రాధిక ఆప్టే, సోనాల్ చుహన్ లు ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Exit mobile version