మరోసారి అదరగొట్టిన దేవీశ్రీ ప్రసాద్

మరోసారి అదరగొట్టిన దేవీశ్రీ ప్రసాద్

Published on Oct 15, 2013 8:49 AM IST

DSP1
‘కింగ్’ అక్కినేని నాగార్జున నటించిన ‘భాయ్’ సినిమా ఆడియో నిన్న సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో విడుదలైంది. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. ప్రస్తుతం యంగ్ తరంగ్ మరియు ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ వరుసగా అన్ని సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందిస్తున్నాడు, అదే తరహాలోనే భాయ్ కి మరోసారి మంచి మ్యూజిక్ ఇచ్చాడు.

పాటలకి చాలా త్వరగా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా కనిపించనుంది. వీరభద్రం చౌదరి డైరెక్ట్ చేసిన ఈ మూవీని నాగార్జున తన సొంత బ్యానర్ పై నిర్మించారు. భాయ్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్నారు. అలాగే డైరెక్టర్ వీరభద్రం చౌదరి సినిమాలో ఫుల్ కామెడీ మరియు యాక్షన్ ఉంటుందని తెలియజేశారు.

విజిట్ చేస్తూ ఉండండి.. ఈ సినిమా ఆడియో రివ్యూని ఈ రోజు మీకు అందించానున్నాం..

తాజా వార్తలు