రేపటి నుంచే దూసుకెల్తా కొత్త షెడ్యూల్

రేపటి నుంచే దూసుకెల్తా కొత్త షెడ్యూల్

Published on Jul 14, 2013 8:45 PM IST

VishnuManchu
మంచు విష్ణు, లావణ్య త్రిపతి హీరో హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘దూసుకెల్తా’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ సోమవారం నుండి హైదరాబాద్ లో మొదలు కానుంది. ఇటీవలే ఈ సినిమాలోని రెండు పాటలను, కొన్ని సీన్స్ ని షూట్ చేసారు. ఇటీవలే ఈ సినిమాకి సంబందించిన కొన్ని సీన్స్ ని విష్ణు మోహన్ బాబుకి చూపిస్తే అవి చూసిన ఆయన ఎంతో థ్రిల్ అయ్యారు. దాంతో మంచు విష్ణు మరో హిట్ తన చేతిలో ఉందని ఎంతో నమ్మకంగా ఉన్నాడు. వీరు పొట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్న ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో తెలియజేసే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు