ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో ‘దూకుడు’ టాప్

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో ‘దూకుడు’ టాప్

Published on Jul 8, 2012 11:03 AM IST


నిన్న రాత్రి చెన్నైలో జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో ‘దూకుడు’ చిత్రం అల్టిమేట్ విన్నర్ గా నిలిచింది.
ఈ చిత్రం మొత్తంగా 6 అవార్డ్స్ గెలుచుకుంది, అవి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు(మహేష్ బాబు), ఉత్తమ దర్శకుడు(శ్రీను వైట్ల), ఉత్తమ సహాయ నటుడు(ఎం.ఎస్ నారాయణ), ఉత్తమ సంగీత దర్శకుడు(ఎస్.ఎస్ తమన్) మరియు ఉత్తమ ప్లేబాక్ సింగర్ (మేల్)(రాహుల్ నంభియార్).ఇప్పటికే సినీ’మా’ అవార్డ్స్ మరియు సైమా అవార్డ్స్ లో అవార్డ్స్ గెలుచుకున్న ఈ చిత్రం మళ్ళీ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకలో ఎక్కువ అవార్డ్స్ గెలుచుకుంది.

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో ‘దూకుడు’ చిత్రానికి కాకుండా బాపు తీసిన ‘శ్రీ రామరాజ్యం’ చిత్రం 5 అవార్డ్స్ గెలుచుకుంది.అందులో ముఖ్యంగా ఉత్తమ నటి(నయనతార), ఉత్తమ ప్లేబాక్ సింగర్ (ఫీమేల్)(శ్రేయా ఘోషల్) అవార్డ్స్ గెలుచుకున్నారు. ‘అనగనగా ఓ ధీరుడు’ మరియు ‘7 ఎఎం అరివు’ చిత్రాలకు గాను శ్రుతి హాసన్ నటనకి ఉత్తమ తొలి కథానాయికగా ఎంపికయ్యారు, ఈ అవార్డును తన తండ్రి కమల్ హాసన్ చేతుల మీదుగా శ్రుతి హాసన్ అందుకున్నారు. ఈ వేడుకకి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులంతా హాజరయ్యారు వారిలో కమల్ హాసన్, మహేష్ బాబు, విక్రమ్, ధనుష్, రామ్, కాజల్, తమన్నా మరియు శ్రుతి హాసన్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు