నా తల్లితో నన్ను పోల్చకండి – కార్తీక

నా తల్లితో నన్ను పోల్చకండి – కార్తీక

Published on Apr 13, 2013 2:30 PM IST

Radha-Karthika

స్టార్ హీరోల, హీరోయిన్ల కుమారులు, కూతుళ్ళు వారి తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలని తమ భుజాల పై వేసుకొని ప్రయాణిస్తువుంటారు. అలాగే అలాంటి వారిలో అప్పటి స్టార్ హీరోయిన్ రాధిక కూతురు హీరోయిన్ కార్తీక ఒకరు. కార్తీక తెలుగులోమొదటిసారిగా నాగా చైతన్య తో కలిసి ‘జోష్’ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె తెలుగులో ఎక్కువగా సినిమాలలో నటించకపోయిన తమిళ, మలయాళం సినిమాలలో నటిస్తు అక్కడ మంచి పేరుకు సంపాదించుకుంది. కార్తీకని స్టార్ లేగేన్సి గురించి అడిగినప్పుడు, కార్తీక మాట్లాడుతూ ‘ అమ్మ నాకన్నచాలా గొప్ప స్టార్, చాలా గొప్పనటి. ఆమెతో నను పోల్చడం కరెక్టు కాదు. మా అమ్మ అంత పెద్ద స్టార్ అయినందుకు నాకు చాలా సంతోషంగా వుంది’. అని చెప్పింది. కార్తీక తెలుగులో చివరిగా ఎన్.టి.ఆర్ తో కలిసి ‘దమ్ము’ సినిమాలో నటించింది

తాజా వార్తలు