అర్జున్ రెడ్డి’ విజయ్ కంటే ముందు మంచు హీరోతో

అర్జున్ రెడ్డి’ విజయ్ కంటే ముందు మంచు హీరోతో

Published on May 29, 2025 4:00 PM IST


ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఆడియెన్స్ లో ఒక కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని అందుకున్న అతి కొద్ది చిత్రాల్లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కలయికలో వచ్చిన సాలిడ్ హిట్ చిత్రం “అర్జున్ రెడ్డి” కూడా ఒకటి. అయితే ఈ సినిమా చేయడానికి ముందు విజయ్, సందీప్ లు అంతే రేంజ్ లో స్ట్రగుల్ కూడా అయ్యారు.

అయితే నిజానికి ఈ సినిమా విజయ్ దేవరకొండ కంటే ముందు ఇంకొందరు హీరోస్ ఇంకా నిర్మాతల దగ్గరకి కూడా వెళ్ళింది. మరి అలా మంచు కుటుంబం నుంచి ఓ హీరో అర్జున్ రెడ్డి చిత్రాన్ని మిస్ చేసుకున్నట్టుగా లేటెస్ట్ గా రివీల్ చేశారు. మరి ఆ హీరో వేయరుఎవరో కాదు మంచు మనోజే..

లేటెస్ట్ గా భైరవం ప్రమోషన్స్ మంచు మనోజ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తాను మిస్ చేసుకున్న సినిమాల్లో అర్జున్ రెడ్డి కూడా ఒకటని. తాను సందీప్ తో కొన్నాళ్ళు ట్రావెల్ చేశాను కానీ అప్పుడు తనకి ఉన్న పర్శనల్ కారణాలు రీత్యా కుదరలేదు అని తెలిపాడు. దీనితో ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ విషయంలో మంచు మనోజ్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు