దాదాపు పూర్తికావచ్చిన డి.కె బోస్

దాదాపు పూర్తికావచ్చిన డి.కె బోస్

Published on Apr 6, 2013 5:37 PM IST

d-k-bose

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘డి.కె బోస్’ సినిమా దాదపు పూర్తయింది. తన సినిమా విశేషాలను తెలుపుతూ సందీప్ ట్విట్టర్లో ఈ విధంగా పెర్కున్నాడు ” ఆఖరి రెండు రోజుల డి. కె బోస్ చిత్రీకరణ… మరోసారి మరో వైవిధ్యమైన పాత్ర… ఎస్.కె నుండి డి.కె గా మారడం ఎప్పుడూ ఎంజాయ్ చేస్తానని”అన్నాడు.

ఈ సినిమాలో నిషా అగర్వాల్ హీరొయిన్ గా కనిపిస్తుంది. సన్నీ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై సన్నీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఆనంద్ రంగా మరియు శేషు రెడ్డి రాండమ్ థాట్స్ బ్యానర్ పై సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. అచ్చు సంగీతం అందిస్తున్నాడు. ఎన్. బోస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు

తాజా వార్తలు