పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమానే ‘హరిహర వీరమల్లు’. మంచి అంచనాలతో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఆల్రెడీ ఏపీలో స్పెషల్ షోలు, హైక్స్ కూడా తెచ్చుకుంది. కానీ నైజాం విషయానికి వస్తే.. రిలీజ్ కి ముందు సరిగ్గా షాక్ తగిలింది.
నిర్మాత ఏ ఎం రత్నం గత సినిమాలు ఆక్సిజన్, అప్పుడెప్పుడో చేసిన బంగారం, ముద్దుల కొడుకు సినిమాల తాలూకా బకాయిలు కూడా చెల్లించాల్సి ఉందని తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. అలాగే వీటిని నైజాంలో హరిహర వీరమల్లు రిలీజ్ కి ముందే సెటిల్ చేయాలని ఈ ప్రెస్ నోట్ ద్వారా తెలుపుతున్నారు. మరి ఇన్ని రోజులు మాట్లాడకుండా సరిగ్గా రిలీజ్ కి ముందు ఇలా చేయడంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.