‘టీజర్ 2’తో ఆకట్టుకుంటున్న ‘డిస్కోరాజా’ !

‘టీజర్ 2’తో ఆకట్టుకుంటున్న ‘డిస్కోరాజా’ !

Published on Jan 13, 2020 4:00 PM IST

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మాణంలో రాబోతున్న తాజా చిత్రం ‘డిస్కోరాజా’. కాగా ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమా నుండి టీజర్ 2 రిలీజ్ అయింది. టీజర్ 2లో మెయిన్ కాన్సెప్ట్ తో పాటు మూవీలో మెయిన్ కాన్ ఫ్లిట్ ను కూడా బాగా ఎస్టాబ్లిష్ చేసారు. ఇక రవితేజ లుక్ అండ్ క్యారెక్టర్ వెరీ ఇంట్రస్ట్ గా ఉంది. ప్రస్తుతం ఈ టీజర్ 2 నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. సినిమా పై ఆసక్తిని పెంచింది.

కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరి జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా రొపొందుతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 18న గ్రాండ్ గా చేయబోతున్నారు. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ , తాన్యాహోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్, ఆబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్, సినిమాకు బాగా ప్లస్ అవుతున్నాయని చిత్రబృందం చెబుతుంది.

టీజర్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తాజా వార్తలు