మహేష్ ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్?

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ఎస్ ఎస్ రాజమౌళితో రానున్న సినిమా గ్యాప్ లో మహేష్ బాబు అభిమానులు తమ హీరో పాత చిత్రాలని రీరిలీజ్ చేసుకొని వాటితోనే ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా మహేష్ నటించిన గత చిత్రాల్లో క్రేజీ హైప్ ఉన్న సినిమాలు చూస్తే వాటిలో ఖచ్చితంగా కనిపించే సినిమా పేరు “ఖలేజా”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి కల్ట్ ఫాలోయింగ్ ఉంది.

అలా ఎన్నో రీరిలీజ్ లలో ఖలేజా రీరిలీజ్ పట్ల కూడా సాలిడ్ హైప్ నెలకొంది. మరి ఈ సినిమా రీరిలీజ్ లలో ఖలేజా టైం కూడా వచ్చింది. ఇలా ఖలేజా చిత్రాన్ని ఈ మే 30కి ప్లాన్ చేసుకున్నారు కానీ ఇప్పుడు ఖలేజా వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. కారణాలు ఏంటి అనేది బయటకి రాలేదు కానీ ఈ మే 30 న మాత్రం ఈ చిత్రం థియేటర్స్ లో ఆగినట్టుగా తెలుస్తుంది. ఇది మాత్రం ఫ్యాన్స్ కి ఒకింత డిజప్పాయింటింగ్ న్యూస్ అనే చెప్పాలి. మరి కొత్త తేదీ ఏంటి ఎప్పుడు అనేవి తర్వాత బయటకొస్తాయట.

Exit mobile version