ఆ హిట్ మూవీకి సీక్వెల్ సిద్ధం చేస్తున్న డైరెక్టర్

ఒకప్పుడు శ్రీను వైట్ల టాప్ హీరోల ఛాయిస్ గా ఉండే వాడు. ఐతే విజయాల పరంగా ఆయన కొంచెం వెనుకబడ్డారు.దీనితో ఆయనకు అవకాశాలు కొంచెం తగ్గాయి. మహేష్ తో ఆగడు సినిమా నుండి ఆయన చేసిన మరో మూడు సినిమాలు ఆశించిన విజయం సాధించలేదు. కాగా ఆయన తన సూపర్ హిట్ మూవీ సీక్వెల్ తో ఫార్మ్ లోకి రావాలని చూస్తున్నాడట.

మంచు విష్ణు, హీరోగా శ్రీహరి ప్రధాన పాత్రలో 2007లో వచ్చిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఢీ’ మంచి విజయాన్ని అందుకుంది. బ్రహ్మానందం తో కలిసి మంచు విష్ణు చేసిన కామెడీ సినిమాలో హైలెట్ గా నిలిచింది. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ త్వరలో రానుందట. ఢీ 2 స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఇప్పటికే శ్రీను వైట్ల బిజీగా ఉండగా ఈ విషయాన్ని హీరో విష్ణు సైతం ధృవీకరించారు. మరి ఢీ మూవీ సీక్వెల్ తో నైనా శ్రీను వైట్ల ఫార్మ్ లోకి వస్తాడేమో చూడాలి.

Exit mobile version