18రోజుల్లో స్క్రిప్ట్, 36 రోజుల్లో షూట్, పెంగ్విన్ విశేషాలు ఎన్నో?

18రోజుల్లో స్క్రిప్ట్, 36 రోజుల్లో షూట్, పెంగ్విన్ విశేషాలు ఎన్నో?

Published on Jun 12, 2020 6:57 PM IST

నిన్న విడుదలైన పెంగ్విన్ ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేసింది. ఎమోషన్స్ అండ్ క్రైమ్ హర్రర్ అంశాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని అర్థం అవుతుంది. ఇక కొడుకు కోసం ప్రమాదాలకు ఎదురెళ్లి, సైకో కిల్లర్ ని ఎదిరించిన లేడీ పాత్రలో సురేష్ నటించినట్లు తెలుస్తుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెలియజేశారు.

ఈ సినిమా స్క్రిప్ట్ కేవలం 18రోజులలో ఈశ్వర్ పూర్తి చేశారట. ఆయన రాసుకున్న ఆ స్క్రిప్ట్ షూటింగ్ కేవలం 36రోజుల్లో పూర్తి చేశారట. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాలో సైకో కిల్లర్ పాత్ర చేసిన మాస్క్ మాన్ పాత్ర చేసినది ఎవరో కూడా దర్శకుడు కీర్తికి చెప్పలేదు. ఆ పాత్ర చేసిన వ్యక్తి ఎవరో కీర్తికి సినిమా పూర్తి అయ్యేనాటికి ఎప్పటికో తెలిసిందట. ఇలాంటి ఆసక్తికర సంగతులు ఎన్నో పెంగ్విన్ సినిమా వెనుక ఉన్నాయట. ఈనెల 19న అమెజాన్ ప్రైమ్ లో పెంగ్విన్ విడుదల అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు