ఈ రోజుల్లో’ డైరెక్టర్ మారుతికి బంపర్ ఆఫర్


ఈ సంవత్సరం ఎలాంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అందుకున్న చిత్రం ‘ఈ రోజుల్లో’. అప్పటి వరకూ ఎవరికీ పెద్దగా తెలియని ఆ చిత్ర డైరెక్టర్ మారుతి ఒక్క సారిగా ఫేమస్ అయిపోయాడు. ఆ సినిమా విజయంతో బెల్లంకొండ సురేష్ అవకాశం ఇవ్వడంతో ‘బస్ స్టాప్’ అనే రెండవ సినిమా మొదలు పెట్టి పూర్తి కూడా చేసేసారు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. నక్క తోకను తొక్కాడో ఏమో గానీ రెండవ సినిమా విడుదల కాకముందే మరో బంపర్ ఆఫర్ కొట్టేశాడు. మారుతి తీయబోయే మూడవ సినిమాని టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబందించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. రేపు విడుదల కానున్న ‘బస్ స్టాప్’ సినిమాపై కూడా అంచానాలు బాగున్నాయి. మారుతి ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి హట్రిక్ కోసం ట్రై చేస్తాడేమో చూడాలి మరి.

Exit mobile version